
సిగరెట్లకు అలవాటు పడిన వాళ్లు ఓ పట్టాన దాన్ని వదలించుకోలేరు. దూమపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఆరోగ్యకరమైన జీవితానికి ఇది హానికరం. అయితే సిగరెట్లు తాగడం కేవలం ఊపిరితిత్తులకే కాదు మొత్తం శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే ముందుగా సిగరెట్లు తాగడం మానేయడం మంచిది. సిగరెట్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్మోకింగ్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన అలవాటు.

సిగరెట్ తాగడం వల్ల తీవ్రమైన వ్యాధులు వస్తాయి. జర్నల్ ఆఫ్ అడిక్షన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. సిగరెట్ తాగడం వల్ల పురుషుల ఆయుర్దాయం 17 నిమిషాలు, స్త్రీలకు 22 నిమిషాలు తగ్గుతుంది.

సిగరెట్ పొగ నెమ్మదిగా మొత్తం శరీరాన్ని విషపూరితం చేస్తుంది. ధూమపానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. సిగరెట్ పొగ స్మోకింగ్ చేసేవారికే కాదు వారి పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి కూడా హానికరం. స్మోకింగ్ దృష్టి సమస్యలను సైతం కలిగిస్తుంది.

సిగరెట్లు తాగడం వల్ల జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింటుందని, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం పెరుగుతుందని కూడా వీరి అధ్యయనంలో తేలింది. ఇది రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది.