Black Coffee: మీరు బ్లాక్ కాఫీ తాగుతారా..? రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా..?

Updated on: Aug 23, 2025 | 5:49 PM

సాధారణంగా కాఫీ అంటే పాలు, చక్కెరతో తాగడం మనకు అలవాటు. కానీ అవి లేకుండా చేసే బ్లాక్ కాఫీకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కావు. ఇటీవల ఒక అధ్యయనంలో ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగేవారి ఆయుష్షు పెరుగుతుందని తేలింది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలనుకునే వారికి ఇది ఒక మంచి అలవాటు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి బ్లాక్ కాఫీ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
స్వీట్లు, ఐస్ క్రీం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగితే ఎందుకు చేదుగా అనిపిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? రెండింటిలోనూ చక్కెర ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
బరువు తగ్గడంలో : బ్లాక్ కాఫీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీర జీవక్రియ రేటును పెంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ దినచర్యలో బ్లాక్ కాఫీని చేర్చుకోవడం మంచిది.

3 / 5
స్నాక్స్, జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు తిన్న తర్వాత కాఫీ తాగడం మానుకోవాలి. ఇది రక్తప్రవాహంలో అసాధారణంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ధాన్యాలు తిన్న తర్వాత కాఫీ తాగడం ఎప్పుడూ మంచిది కాదు. ఇది ధాన్యాలలోని విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది.

4 / 5
అయితే బ్లాక్ కాఫీ తాగవచ్చు. కానీ పాలతో కాఫీ తాగకూడదు. పోషకాహార నిపుణులు చెప్పేది ఇదే.. ఎందుకంటే పాలతో కాఫీ తాగడం వల్ల పాలలో కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది.

5 / 5
ఎంత కాఫీ తాగాలి..? కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు 1 నుండి 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు.