చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

Edited By:

Updated on: Aug 05, 2026 | 10:25 AM

గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కూరగాయల సాగుకు పెట్టింది పేరు. చాలా ఏళ్ల నుంచి కరువుతో ఇబ్బంది పడ్డారు. మంచి నేల ఉన్నప్పటికీ నీళ్లు లేకపోవడంతో సాగుకు దూరమయ్యారు. ఎన్నో బోర్లు, బావులు తవ్విన ఆశించిన స్థాయి సాగు కాలేదు. అయితే ఇక్కడ రైతులు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన డ్రిప్ విధానాన్ని అమలుపరిచారు. పదేళ్ల క్రితమే ఇక్కడి రైతులు డ్రిప్ పైన మక్కువ చూపారు. నీళ్లు తక్కువగా తాగే పంటలను సాగు చేశారు.

3 / 5
భారీ వర్షం కురిసినా.. కురవకున్నా పంటలు మాత్రం పండేవి. ముఖ్యంగా కూరగాయల సాగుకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో ఎక్కడ పచ్చదనం కనబడటం లేదు. ఈ గ్రామంలో అడుగుపెడితే ఎటుచూసినా పచ్చదనం కనబడుతుంది. కూరగాయల సాగుతో రైతులు బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రతి నీటి బొట్టును కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. పూర్తిగా డ్రిప్ ఆధారంగానే సాగు చేస్తున్నారు. డ్రిప్ తో పాటు స్ప్రింకర్ల్స్ ద్వారా కూడా సాగు చేస్తున్నారు. దీంతో నీటిని పొదుపుగా వాడటంతో పాటు దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బీర, బెండ, కాకర దిగుబడి రానుంది.

4 / 5
మే నెలలో తీవ్రమైన ఎండలు ఉన్న అప్పటికే సాగుకు సిద్ధం చేసి జూన్ నెలలో కూరగాయల సాగును మొదలుపెట్టారు. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు చేతికొస్తున్నాయి. ఈ గ్రామంలో వరి సాగు చాలా తక్కువ కనబడుతుంది. ఎటు చూసినా కూరగాయలు మొక్కజొన్న లేదంటే వేరుసెనగ పంటలు మాత్రమే పండిస్తున్నారు. దాదాపున ఇలాంటి గ్రామాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. కొంత అధికారులు ప్రోత్సహించిన రైతులే స్వయంగా బిందు సేద్యం పైన దృష్టి పెట్టి సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరువును జయించి అధిక దిగుబడి చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

5 / 5
గత పదివేలుగా డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రతి నీటి బొట్టును కూడా వాడుతున్నామని తెలుపుతున్నారు. ఎలాంటి నష్టాలు లేకుండా పంటలు సాగు చేయడం సంతోషంగా ఉందని తెలుపుతున్నారు. ఇప్పటివరకు కరువు లేకుండానే సాగు కొనసాగుతుందని తెలుపుతున్నారు. డ్రిప్ విధానంతో ఇక్కడ చాలామంది ఆర్థికంగా బలోపేతమయ్యారని ఆనందంగా చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us