
ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పక్షు జాతులు ఉన్నాయి. కానీ వాటిలో ఈ ఒక్క పక్షిమాత్రం అత్యంత విషపూరితమైనదిగా పేరు పొందింది. అదే హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui). ఈ పక్షి మనకు ఎక్కుగా న్యూ గినియా అడవుల్లో కనిపిస్తుంది. చూడ్డానికి అచ్చం కాకిలాగే కనిపించే ఈ పక్షి వంటి నిండా విషాన్ని కలిగి ఉంటుంది.

ఈ ప్రత్యేక లక్షణంతోనే ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా గుర్తింపు పొందింది. ఈ పక్షికి ఉన్న మరో ప్రత్యేక ఏంటంటే.. ఇది ఇతర పక్షులపై దాడి చేయడదు, వేటాడదు. కానీ దీని జోలికి మాత్రం ఒక్క జీవి కూడా రాదు. ఎందుకంటే.. దీపి శరీరాన్ని తాకిన ఇతర పక్షులకు ప్రమాదం.

ఈ పక్షి శరీరం నిండా విషం ఉండడం వల్ల పక్షులు దీనిపై దాడి చేయవు. దీని శరీరమే దీనికి రక్షణ కవచంలా ఉంటుంది. అయితే దీని ఓంట్లో ఇంతలా విషం ఉండడానికి ప్రధాని కారణంగా ఏమిటంటే.. ఇది తినే ఆహారం. అవును ఇది తనే ఆహారం కారణంగానే దీని శరీరంలో విషం ఉత్పత్తి అవుతుందట.

అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పక్షిలో ఉత్పత్తి అయ్యే విషం దాని బాడిలో కాకుండా చర్మం, రెక్కలపై మాత్రమే ఉంటుందట. పొరపాటు వేరే జీవులు కనుక దీనికి తగిలితే వాటికి ప్రాణహాని తప్పదట. ఈ పక్షి శరీరలో ఉత్పత్తి అయ్యే విషాన్ని బాట్రాచోటాక్సిన్ అంటారు. అదే విషం డార్ట్ కప్పలలో కూడా కనిపిస్తుంది.

ఒక వేళ ఈ పక్షి చర్మంపై ఉంటే విషం మనుషులుకు కానీ తగిలితే. తిమ్మిరిగా అనిపిస్తుంది. కొన్ని సార్లు ఇది తీవ్ర అనారోగ్యానికి దారి తీయవచ్చు. ఈ పక్షి ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు దీని గురించి బాగా తెలుసు. కాబట్టి ఎవరూ దాని జోలికి వెళ్లరు.మొత్తానికి ప్రకృతిలో కనిపించే అరుదైన, అత్యంత అందమైన పక్షులు కూడా ఇంత ప్రమాదకరంగా ఉంటాయని ఎవరూ ఊహించకపోవచ్చు. కాబట్టి ఈ పక్షి మీకు ఎక్కడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.