
కావాల్సిన పదార్థాలు : చికెన్ పెద్ద సైజు ముక్కలతో, వన్ కేజీ, పెరుగు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్, కారం రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, కసూరి మేతీ, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వన్ టీ స్పూన్, నూనె, వేయించడానికి సరిపడ, నిమ్మరసం 3 టీ స్పూన్స్.

తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను వేసుకొని, వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ ఉప్పు, పెరుగు, కారం, ఉప్పు, కసూరీ మేతీ, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మరసం, రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేలా చూసుకోవాలి. తర్వాత దీనిని నాలుగు గంటల పాటు, ఫిజ్‌లో పెట్టాలి.

తర్వాత ఫ్రిజ్ నుంచి తీసి, ఈ చికెన్ మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి కనీసం మూడు విజుల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. దీని తర్వాత కుక్కర్ మూత తీసి మరో ఐదు లేదా పది నిమిషాల పాటు చిన్‌లో ఎలాంటి నీటి శాతం లేకుండా ఉడకబెట్టుకోవాలి.

దీని తర్వాత కుక్కర్‌లో చికెన్ ముక్కల మధ్యలో ఒక గిన్నె పెట్టి అందులో రెండు లేదా మూడు బొగ్గులు వేసి, దానిపై నెయ్యి వేసి, ఆవిరి బయటకు పోకుండా మరో పదినిమిషాలు కుక్కర్ పైన ఉడకబెట్టుకోవాలి.

దీని తర్వాత మనం పుల్కాలు కాల్చుకొనే స్టాండ్ పై కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలను తీసి, మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ క్రమంలోనే వీటిపై కాస్త గరం మసాలా లైట్‌గా చల్లుకోవాలి. అంతే వేడి వేడి తందూరీ చికెన్ రెడీ.