90’s కిడ్స్ ఫేవరెట్..చిన్ననాటి స్వీట్ మిర్చీ గుర్తుందా? దీనిని ఇంట్లో ఎలా చేయాలంటే?

Updated on: Jun 05, 2026 | 5:30 PM

90's కిడ్స్ ఫేవరెట్ స్నాక్‌లో తీపి మిర్చీ ముందుంటాయి. చాలా మందికి ఇవి ఇష్టం. చిన్నతనంలో వీటిని చాలా ఎక్కువగా తినే వారు. అయితే ఇప్పుడు ఇవి షాపుల్లో ఎక్కువగా లభించడం లేదు. అయితే మీకు మీ చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేసే ఈ స్వీట్ మిర్చీ తినాలని ఉందా? అయితే ఈ అద్భుతమైన రిసిపీని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు :  మైదాపిండి 2 కప్పులు,  ఉప్పు చిటికెడు,   నెయ్యి 2 స్పూన్లు,  చక్కెర 1 కప్పు,   నీరు పావు కప్పు (పాకానికి),  ఫుడ్ కలర్స్, ఎరుపు, ఆకుపచ్చ, ఏలకుల పొడి, రుచికి సరిపడా,   వేయించడానికి సరిపడా నూనె.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేయాలి. అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసి పొడి పిండిలో నెయ్యి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు పోసి చపాతి పిండి విధానంలో కలుపుకోవాలి. పిండి మంచిగా మెత్తగా కలిసిన తర్వాత ఫుడ్ కలర్స్ తీసుకోవాలి.

3 / 5
ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్స్ తీసుకోవాలి. మీరు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని రెండు ముద్దలుగా చేసుకోవాలి. అందులో ఒకదానికి నారింజ రంగు, మరొక దానికి ఆకుపచ్చ రంగు అద్ది, మళ్లీ మెత్తగా కలిపి వేటికి అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి. తర్వాత వాటిని మిరపకాయల ఆకారంలో తయారు చేసుకోవాలి.ఇలా అన్ని మిరపకాయలను సిద్ధం చేసుకోవాలి.

4 / 5
ఇప్పుడు డీప్ ఫైకి నూనె సిద్ధం చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిరపకాయలను అందులో వేసి వేయించుకోవాలి.  అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చి, నూనె బుడగలు తగ్గినప్పుడు, గలగలమనే శబ్దం వచ్చినప్పుడు వేగిపోయినట్లు నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు వేయించిన మిరపకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఎరుపు, ఆకుపచ్చ మిరపకాయలను విడివిడిగా వేయించుకోవాలి.

5 / 5
చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో ఒక కప్పు చక్కెర, పావు కప్పు నీరు వేసి వేడి చేయాలి. చక్కెర కరిగి, పాకం లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం చిక్కగా, తీగ విరగకుండా చేతికి వచ్చేలా ఉండాలి. పాకం వచ్చే సమయంలోనే యాలకుల పొడి వేసుకోవాలి. ఇక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అందులో ఈ మిరపకాయలు వేసుకోవాలి. గంట సేపు అలాగే ఉంచడం వలన మిరపకాయలకు చక్కెర బాగా పట్టి రుచిగా ఉంటాయి.

Follow Us