
జుట్టు రాలడం సాధారణంగా కనిపించినా.. ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తుంది. ఇక శీతాకాలంలో ఈ సమస్య రెట్టింపు అవుతుంది. ఇంట్లో తయారుచేసిన కొన్ని రకాల నూనెలు ఈ సమస్య నుంచి బయటపడటానికి సహాయపడతాయి. నేటి కాలంలో చాలా మంది తలకు నూనె రాసుకోవడానికి ఇష్టపడరు. కానీ జుట్టుకు కూడా నూనె అవసరమని అటువంటి వారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నూనె జుట్టుకు లోపలి నుంచి పోషణ అందిస్తుంది.

మార్కెట్లో దొరికే వాణిజ్య నూనెకు బదులుగా ఇంట్లో తయారుచేసిన నూనెను ఉపయోగిస్తే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. అందుకు వెండర్ నూనె, కొబ్బరి నూనె ఉంటే చాలు. ఈ నూనెను తయారు చేయడానికి 10 చుక్కల కొబ్బరి నూనె, ఐదు చుక్కల లావెండర్ నూనె అవసరం. ఈ రెండు నూనెలను బాగా కలిపి మరిగించాలి. తర్వాత చల్లార్చి తలకు పట్టించాలి.

పుదీనా, బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనె శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది.

ఈ నూనెను తయారు చేయడానికి.. ముందుగా 15 చుక్కల బాదం నూనె తీసుకోవాలి. అందులో 3 చుక్కల పిప్పరమెంటు నూనె కలపాలి. ఇప్పుడు తక్కువ వేడి మీద మరిగించాలి. కొద్దిగా చల్లగా అయినప్పుడు, దీనిలో జుట్టుకు మసాజ్ చేసుకోవాలి.

రోజ్మేరీ, ఆముదం నూనెలను జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉపయోగించవచ్చు. ఈ నూనె కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెను తయారు చేయడానికి.. ముందుగా ఒక గిన్నెలో 5 చుక్కల ఆముదం, 5 చుక్కల ఆర్గాన్ ఆయిల్, 1 చుక్క రోజ్మేరీ ఆయిల్ తీసుకోవాలి. వీటిని బాగా కలపాలి. ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేసి, గంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరి.