Beard Itching: గడ్డం దురదతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో దీనినుంచి ఉపశమనం..

|

May 02, 2023 | 1:14 PM

పెరిగిన గడ్డం లుక్‌ని కాపాడుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. నిజానికి తల వెంట్రుకల మాదిరే గడ్డం వెంట్రుకలని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి తరచుగా గడ్డంలో దురదగా ఉంటుంది.

1 / 6

2 / 6
ఈ పరిస్థితిలో పురుషులు బహిరంగ ప్రదేశాల్లో చాలా ఇబ్బందిపడుతారు. గడ్డం దురదకు ప్రధాన కారణం పొడి చర్మం, వాతావరణ మార్పులు, సబ్బులు, ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం, కొన్ని మందులు లేదా సోరియాసిస్, తామర వల్ల గడ్డంలో దురద ఏర్పడుతుంది.

3 / 6
అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని చిట్కాలని పాటిస్తే సమస్య పరిష్కారమవుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. గడ్డం వెంట్రుకలను ఆండ్రోజెనిక్ హెయిర్ అంటారు. అంటే టెస్టోస్టెరాన్ వల్ల పెరుగుదల జరుగుతుంది. ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటే వెంట్రుకల పెరుగుదల మందంగా ఉంటుంది. గడ్డం బాగా పెరగడం, పొడి చర్మం వల్ల దురద ఏర్పడుతుంది.

4 / 6
గడ్డం దురదను ఆపడానికి ముందుగా ప్రతి రోజూ స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. గడ్డ దురదగా ఉంటే ముందుగా గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ వెంట్రుకల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫేస్ వాష్ ఉపయోగించాలి. ఇది కాకుండా గడ్డం కండీషనర్‌ను ఉపయోగించాలి.

5 / 6
ఇందులో జోజోబా ఆయిల్ లేదా ఆర్గాన్ ఆయిల్ ఉంటుంది. ఇది కాకుండా మీరు గడ్డం కోసం న్యూ ఆయిల్‌ లేదా కండీషనర్ ఉపయోగిస్తున్నప్పుడు అది మీ చర్మానికి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే మంచిది. లేదంటే మొటిమలు అలర్జీ ఏర్పడవచ్చు.

6 / 6
ఎక్కువసేపు స్నానం చేయవద్దు. చాలా వేడి నీటిని ఉపయోగించవద్దు. మీరు మీ గడ్డం షేవ్ చేసినప్పుడు లేదా ట్రిమ్ చేసినప్పుడు సహజమైన ఆఫ్టర్ షేవ్ వాష్‌ని ఉపయోగించాలి.