వర్షాకాలం అంటనే సీజనల్ వ్యాధులకు కేరాఫ్. ఇది మలేరియా-డెంగ్యూ ప్రమాదాన్ని పెంచుతుంది. ఫీవర్ కేసులు పెరుగుతాయి. వర్షాలకు, దోమలు భయంకరమైన రూపాన్ని సంతరించుకుంటాయి. డెంగ్యూ-మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. దీనివల్ల విపరీతమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, వాంతులు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య చిన్నదైతే వైద్యుల సలహా మేరకు కొన్ని ఆయుర్వేద పద్ధతులను అనుసరించవచ్చు.