Vizianagaram Fort: ఇప్పటికీ చెక్కు చెదరని విజయనగరం కోట.. దీని నిర్మాణ చరిత్ర ఇదే..

Updated on: Jun 03, 2025 | 11:00 AM

విజయనగరం కోట ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కేంద్రం నడిబొడ్డున 18వ శతాబ్దానికి చెందింది. ఇది విజయనగర మహారాజు విజయ రామరాజు నిర్మించారు. దీని నిర్మాణానికి ముందు కుమిలిలో మట్టి కోట నుంచి పాలించారు. దీని నిర్మాణ శైలి, చరిత్ర ఈరోజు మనం ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం..

1 / 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేంద్రంలో ఉంది విజయనగరం మహారాజా కోట. ఇది ఒకప్పటి ఉత్తరాంధ్రుల రాజధాని. విజయనగరం కోటను 1713లో నిర్మించారు. ఈ కోటను ఐదు విజయాలకు సంబంధించిన ఐదు సంకేతాలకు ప్రతీకగా నిర్మించారు.

2 / 5
ఈ కోట స్థాపకుడు ఈ ప్రాంత మహారాజా పూసపాటి విజయ రామరాజు (1671-1717). ఆయనను ఆనంద రాజు అని కూడా పిలుస్తారు. విజయనగరం మహారాజుకు అడవిలో తపస్సు చేస్తున్న మహబూబ్ వలి అనే ముస్లిం సాధువు కోట నిర్మాణానికి అనువైన ప్రదేశంగా సలహా ఇచ్చాడు.

3 / 5
కోట శంకుస్థాపనకి మొదటి పునాది రాయి పవిత్ర హిందూ పండగ దసరా పండుగ పదవ రోజున విజయ దశిమి రోజు, మంగళ వారం నాడు పడింది. కోట రాతితో నిర్మించబడింది. ఈ కోట 240 మీటర్లు (790 అడుగులు) చదరపు ఆకారంలో, 10 మీటర్లు (33 అడుగులు) ఎత్తులో నిర్మించబడింది.

4 / 5
కోట గోడలు పైభాగంలో 8 నుండి 16 మీటర్లు (26-52 అడుగులు) వెడల్పుతో నిర్మించబడ్డాయి. కోట నాలుగు మూలలు రాతి బురుజుల రూపంలో ఉన్నాయి. దీని లోపలి భాగం ఏటవాలు నేలపై రాతి పలకలతో బలోపేతం చేయబడింది. కోటలోకి ప్రవేశించడానికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.

5 / 5
తూర్పున ఉన్న ప్రధాన ద్వారం "నగర్ ఖానా". ఇది సొగసైన నిర్మాణ నమూనాలను కలిగి ప్రవేశ ద్వారం వద్ద విజయానికి చిహ్నంగా ఒక తోరణం ఉంది. పశ్చిమ ప్రధాన ద్వారం చిన్నది కానీ ప్రధాన ద్వారం వలె అదే నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది. కోట చుట్టూ కందకం ఉంది.