చిన్న బెల్లం ముక్కతో భలే ఆరోగ్యం…! భోజనం తరువాత నోట్లో వేసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..

Updated on: Aug 07, 2025 | 4:46 PM

బెల్లం తినడం వల్ల శరీరానికి చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల శరీరానికి అమృతంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎన్ని సమస్యలు నయమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
రోజూ బెల్లం తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 6
ప్రతి రాత్రి పడుకునే ముందు స్వీట్స్‌ వంటి తీపి పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, బరువు పెరుగుతారు. అలాంటి సందర్భంలో మీరు కొద్దిగా బెల్లం, నెయ్యితో కలిపి తినవచ్చు.

3 / 6
బెల్లంలో కొద్దిగా నెయ్యి కలిపి తినడం వల్ల రాత్రిపూట మంచి నిద్రను పొందడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా రోజువారీ ఆహారంలోనూ బెల్లం చేర్చుకోవడం అవసరం.

4 / 6
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిని రాత్రి తినడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లంలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు నోటి లోపల బాక్టీరియా పెరగకుండా నివారిస్తాయి. ఇది దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా ఉంటుంది.

5 / 6
ఇది బరువు పెరగడం వల్ల కలిగే అసౌకర్యాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా బెల్లం తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బెల్లం, నెయ్యి తినవచ్చు.

6 / 6
మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి. అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం మంచిది కాదు. రోజు కేవలం 5 నుంచి 10 గ్రాముల బెల్లం మాత్రమే తినాలి.
భోజనం తరువాత బెల్లం తింటే ఆరోగ్యం వందశాతం నిజం. మన శరీరానికి సహజంగా మేలు చేసే బెల్లాన్ని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి. అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం మంచిది కాదు. రోజు కేవలం 5 నుంచి 10 గ్రాముల బెల్లం మాత్రమే తినాలి. భోజనం తరువాత బెల్లం తింటే ఆరోగ్యం వందశాతం నిజం. మన శరీరానికి సహజంగా మేలు చేసే బెల్లాన్ని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు.