
లెమన్ గ్రాస్ టీని రోజూ తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ మంత్రించినట్టు తగ్గుతాయి. లెమన్ గ్రాస్ లో సిట్రల్, జెరేనియం అనే రెండు యాంటీ ఇన్ప్లమేటరీ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Lemongrass Tea

యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

లెమన్ గ్రాస్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది.

lemongrass