Heart Care: వీటిని తింటే గుండె రోగాలు జీవితంలోరావు.. మీరు తింటున్నారా?

Updated on: Jan 29, 2026 | 12:40 PM

ఇటీవల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి..

1 / 6
ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ధమనులలో అడ్డంకులు రాకుండా కాపాడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

2 / 6
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3 / 6
సాల్మన్ లేదా సార్డిన్స్ వంటి కొవ్వు చేపలు గుండె ఆరోగ్యానికి మంచివి. ఈ చేపలు ట్రైగ్లిజరైడ్లను నియంత్రిస్తాయి. రక్తపోటును సమతుల్యం చేస్తాయి.

4 / 6
పాలకూర, మెంతి, ఆవాలు వంటి ఆకుకూరలలో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ధమనులను మరింత సరళంగా చేస్తాయి.

5 / 6
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి.

6 / 6
సాధారణంగా 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా గుండెను ఒత్తిడి నుంచి కాపాడుతాయి.