పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం

Updated on: Jul 18, 2026 | 5:38 PM

పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి టిఫిన్ చేయాలా అని తల్లులు తెగ ఆలోచిస్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు ఇడ్లీ చేసి పెడితే ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ, ఈ విధంగా ఇడ్లీ తయారు చేసి పెడితే వారు ఇష్టంగా తినడమే కాకుండా ఒక్కటి తిన్నా కొండంత బలం వస్తుందంట. కాగా, ఆ రిసిపీ ఏదో చూసేద్దాం.

1 / 5
చాలా వరకు ప్రతి ఒక్కరూ నార్మల్ ఇడ్లీ చేస్తుంటారు. అయితే దీని కంటే వెజిటేబుల్స్ కలిపి వెజిటేబుల్ ఇడ్లీ చేయడం వలన అది రుచికరంగా ఉండటమే కాకుండా పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఈ వెజిటేబుల్ ఇడ్లీని పిల్లలు ఒక్కటి తిన్నా చాలు కడుపు నిండిన భావన కలగడమే కాకుండా వారి ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.

2 / 5
వెజిటేబుల్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : అర కేజీ ఇడ్లీ రవ్వ, పెరుగు, కూరగాయలు తరిగినవి ఒక కప్పు, పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్, పచ్చి మిరపకాయలు,క్యారెట్, క్యాప్సికం,  రుచికి సరిపడ ఉప్పు, రెండు టీ స్పూన్ల ఇనో ఉప్పు. ఈ పదార్థాలతో చాలా సులభంగా వెజిటేబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేయవచ్చును.

3 / 5
ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఇడ్లీ రవ్వను జల్లించుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వ, పెరుగు , రెండూ కలిపి రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత  ఒక బౌల్ తీసుకొని, నూనే వేసి నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు,  అన్ని పదార్థాలు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత వీటిని ఆ మిశ్రమంలో వేసి కలపాలి. వీటిని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో టీ స్పూన్ ఈనో, బేకింగ్ సోడా వేసి మంచిగా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ గిన్నెలకు మంచిగా నూనె రాసుకోవాలి. తర్వాత అందులో ఈ కూరగాయల ఇడ్లీ మిశ్రమం అందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఇడ్లీ పాత్ర పెట్టి, అందులో నీళ్లు పోయాలి. అవి కాస్త వేడి అయిన తర్వాత అందులో ఇడ్లీ వేసి పాత్రలు పెట్టి గట్టిగా మూత పెట్టాలి.

5 / 5
ఇప్పుడు ఇడ్లీలు ఉడకిన తర్వాత వాటిని తీయాలి. కొద్దిగా చల్లారే వరకు వాటిని అలాగే ఉంచుకోవాలి, తర్వాత వాటిని చిన్న చాక్‌తో ఒకదాని తర్వాత మరొకటి మొత్తం తీసుకోవాలి. ఇక వీటిని మీ పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టి, వీటితో పాటు, కొబ్బరి చట్నీ, టొమాటో సాస్ లేదా సాంబార్ ఏది పెట్టినా సరే పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు.

Follow Us