ఇంట్లో పాము ఉందని ఎలా గుర్తించాలో తెలుసా?

Samatha

7 August 2026

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందిలో పాముల భయం ఎక్కువగా ఉంటుంది. ఇంటి చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయి.

కొన్ని సార్లు తెలియకుండానే ఇంట్లోకి కూడా ప్రవేశిస్తుంటాయి. దీంతో కొన్ని సార్లు వీటివలన ఇంటిలో ఉండే వారికి ప్రమాదం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది.

అందువలన ఇప్పుడు మనం ఇంటిలో ఉండే పామును చాలా సులభంగా ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం. చిన్న చిట్కాలతో ఇంటిలోని పామును గుర్తించ వచ్చంట.

ఎప్పుడూ లేని విధంగా మీ ఇంటిలో ఒక రకమైన వింత, ఘాటు అయిన వాసన వస్తే ఆలస్యం చేయకుండా ఇంటిలో పాము ఉందేమో అని గుర్తించాలి.

అలాగే చాలా వరకు పాముల ఆహారం కోసం వెతుకుతూ వస్తుంటాయి. అయితే మీ ఇంటిలో ఎలుకలు ఎక్కువగా ఉండి తగ్గిపోతే పాము ఉన్నట్లు గుర్తించాలి.

మీ ఇంటిలో ఎక్కడైనా ఎలుక అకస్మాత్తుగా చనిపోయి ,దాని పై గాట్లు ఉండటం గమనించినా ఇంటిలో పాము ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.

అలాగే, ఎక్కడైనా ఇంటిలోపల పాము కుబుసం కనిపిస్తే మాత్రం తప్పకుండా అలర్ట్ అవ్వాలి. మీ ఇంట్లో పాము తిరుగుతున్నట్లు గుర్తించాలి.

అదే విధంగా రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపించినా మీ ఇంటిలో పాము ఉన్నట్లు గుర్తించి, అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు.