
పల్లెటూరి వంటల్లో ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ చాలా ఫేమస్. అవి మరేవో కావు సజ్జప్పాలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తీపి వంటకం. సజ్జలతో చేసే ఈ రెసిపీ శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. ఇంకా రుచికి కూడా సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే పెద్దల వరకు ఇష్టంగా తింటారు అందరికీ నచ్చుతుంది.

సజ్జప్పాల రెసిపీకి కావాల్సిన పదార్థాలు : రెండు కప్పుల సజ్జపిండి, పావు కప్పు బెల్లం, రెండు గ్లాస్ లు నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్, నువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము, అర కప్పు నూనె అప్పాలను వేయించడానికి తీసుకోవాలి.

ముందుగా ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని దానిలో పోసి, అవి బాగా వేడి అయిన తర్వాత బెల్లం కూడా వేసి మీడియం మంటపై అలా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా పాకం లాగా అయ్యాక కిందకు దింపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టి మళ్లీ గ్యాస్ పొయ్యి మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల బెల్లం మంచిగా అవుతాయి అలా శుద్ధి కూడా అవుతుంది.

సజ్జ పిండిని బాగా కలుపుకోవాలి : అయితే, మీడియం మంట మీద సజ్జపిండిని వేయించాలి ఇక్కడ ఇది అస్సలు మర్చిపోకండి. ఉండలు లేకుండా దీనిని బాగా కలుపుతూ ఉండాలి. ఉండలుగా ఉంటే పప్ప సరిగా రాదు. కాబట్టి, కొంచం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇది మెత్తగా అయిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి దానిని బాగా చల్లారనివ్వాలి.

ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండల మాదిరి చేసుకోవాలి. ఆ తరువాత వీటిని రూపాయి కవర్ పై పెట్టి పప్పాలాగా చేసి ఒత్తాలి. మరి పలుచగా మీడియం మంట మీద ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాలానిచ్చాక ప్లేట్ లేదా చిన్న గిన్నెలో వీటిని పెట్టుకుని. ఆరిపోయిన తర్వాత తింటే రుచిగా ఉంటుంది.