పసి పిల్లలు అన్నం తినకపోతే తప్పక పెట్టాల్సిన కిచిడీ ఇదే.. శరీరానికి బలం

Updated on: Aug 21, 2026 | 1:12 PM

పిల్లల ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు. అందుకే తల్లిదండ్రులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అయితే చాలా మంది పిల్లలు ఎక్కువగా అన్నం తినను అంటూ మారం చేస్తుంటారు. అయితే అలాంటి వారికి ఇలా కిచిడీ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారంట. కాగా, దాని గురించే ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
పిల్లల ఎదుగుదలకు పోషక భరితమైన ఆహారం చాలా ముఖ్యం. పసిపిల్లలు అన్నం సరిగ్గా తినకపోయినా లేదా వారి దైనందిన ఆహారంలో పోషకాలను పెంచాలనుకున్నా, పాలక్ రైస్ కిచిడీ ఒక ఉత్తమమైన ఎంపిక. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, శక్తిని అందిస్తుంది. అన్నం తినడం ప్రారంభించిన ఏ పసిపిల్లలకైనా ఈ రెసిపీని అందించవచ్చు.

2 / 5
తయారీకి కావలసిన పదార్థాలు:  బియ్యం: పావు కప్పు,  పెసరపప్పు: పావు కప్పు,  నెయ్యి: ఒక టీస్పూన్,వెల్లుల్లి: ఒకటి,   ఉల్లిపాయ,  క్యారెట్ ముక్కలు, పాలకూర ఆకులు, నీళ్లు,  మిరియాల పొడి: పావు టీస్పూన్,  ఉప్పు

3 / 5
 ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు బియ్యం, పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ కొన్ని నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.  తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో  ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక,  వెల్లుల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ముక్క, కడిగి పొట్టు తీసి కట్ చేసిన రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి.

4 / 5
 ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు పాలకూర ఆకులను కుక్కర్‌లో వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. పాలకూర కొద్దిగా మగ్గితే సరిపోతుంది. అదే విధంగా  నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు కుక్కర్‌లో వేయాలి. బియ్యం,  తర్వాత సరిపడ నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇందులోనే రుచి కోసం పావు టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.

5 / 5
ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి, నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తర్వాత ఆఫ్ చేసి, ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూడగా, కిచిడీ మెత్తగా ఉడికి ఉంటుంది. ఈ కిచిడీ వేడివేడిగా ఉన్నప్పుడే  దానిని మెత్తగా చేసి , పిల్లలకు తినిపించాలి. అంతే  వేడి వేడి పాలక్ రైస్ కిచిడీ రెడీ

Loading...
Unable to load recommendations.
Follow Us