
వెన్నునొప్పి సమయంలో పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి

బ్రోకలీలో విటమిన్లు సి,ఇ తో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. బ్రోకలీని కూరగాయల్లో భాగం చేసుకోవచ్చు లేదా సూప్ తయారుచేసుకుని తీసుకోవచ్చు.

చియా లేదా అవిసె గింజల్లో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవి వెన్నునొప్పి నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం పరగడుపునే తీసుకోవచ్చు లేదా వాటి స్మూతీని తాగొచ్చు.

గమనిక: వెన్నునొప్పి బాధితులు డాక్టర్ లేదా నిపుణులను సంప్రదించిన తర్వాతే తగిన చికిత్స, ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చిట్కాలు అందరికీ ఉపయోగ పడకపోవచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ ఆహార పద్ధతులను పాటించాలి

డ్రై ఫ్రూట్స్: శరీరంలో ప్రోటీన్, ఫైబర్ లేదా ఇతర పోషకాలు లేకపోవడం వల్ల తరచుగా వెన్నునొప్పి వస్తుంది. ఈ పోషకాల లోపాన్ని తీర్చడానికి, డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్‌ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్ని పరగడుపున తీసుకుంటే మంచి ఫలితముంటుంది.

చేపలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాల లోపం ఉంటే, అది అలసట మరియు వెన్నునొప్పికి దారి తీస్తుంది. అలాంటి వారు వారంలో కనీసం ఒకసారైనా ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలను తీసుకోవాలి.