uppula Raju |
Mar 01, 2022 | 8:49 PM
తేనె: ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో బరువుగా ఉంటే కొద్దిగా తేనె తీసుకోండి. సమస్య పరిష్కారమవుతుంది.
ఏలకులు: పచ్చి ఏలకులు, టీ లేదా ఆహారం రుచిని పెంచుతాయి. మీరు భోజనం, అల్పాహారం తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే పచ్చి ఏలకులు నమలండి. ఇలా చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర: ఇంట్లో వంటగదిలో ఉండే జీలకర్రని కొద్దిగా తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
సోంపు, పంచదార : సాధారణంగా హోటళ్లలో భోజనం తర్వాత బిల్లుతో సోంపు అందిస్తారు. సోంపు, పంచదార కలిపి తింటే పొట్ట బరువు తేలికవుతుంది. ఇది ఇతర కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
అవిసె గింజలు: మీకు తరచుగా కడుపు ఉబ్బరంగా ఉంటే మీరు అవిసెగింజలని ఔషధంగా వాడవచ్చు. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తాగితే చాలు..