1 / 5
నిమ్మకాయ నీరు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు ముఖ్యంగా బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ లెమన్ వాటర్ సరిగా తీసుకోకపోతే, అది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో లెమన్ జ్యూస్ తాగే వ్యక్తులు కడుపు, దంత సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.