
బరువు తగ్గాలనుకునే వారికి లిచీ పండు చక్కటి ఆహారం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కణజాల నష్టం నిరోధించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది. జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది.

లిచీ పండు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ లిచీ పండ్లను తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఈ పండ్లు హైపోగ్లైసీమియా లేదా రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలుండేలా చేయవచ్చు.

లీచీ పండ్లను తక్కువ మొత్తంలో లేదా ఎప్పుడైనా తీసుకుంటే అరోగంపై ఎటువంటిహానికరమైన ప్రభావం చూపించదు. అయితే లిచీ తినడాన్ని ఇష్టపడుతూ.. ఎక్కుగా తీసుకుని వుంటే పండులోని ప్రోటీన్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి అంతేకాదు కొన్ని రకాల అలెర్జీలకు కారణమవుతాయి.

అయితే లిచీ పండు వల్ల కలిగే అలర్జీ గురించి సైన్స్‌లో పెద్దగా పరిశోధనలు జరగలేదు.

గర్భధారణ సమయంలో, తల్లిపాలు ఇచ్చే సమయంలో మహిళలు లిచీని తినేముందు తప్పని సరిగా వైద్యుడిని సంప్రదించాలి.

పరిశోధన ప్రకారం, లీచీలో ఉండే హైపోగ్లైసిన్ A అనే పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

లిచీ పండు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు చర్మం దురద, గొంతు వాపు, పెదవుల వాపు, చర్మంపై పొక్కులు, విరేచనాలు వంటివివాటితో ఇబ్బంది పడతారు.