పానీ పూరీ అంటే ఇష్టపడని వారు బహు అరుదు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే ఈ పానీ పూరీని ముఖ్యంగా యువత మరింత ఇష్టంగా తింటారన్న సంగతి తెలిసిందే.. అందుకే సాయంత్రం అయితే చాలు స్టూడెంట్స్, ఉద్యోగస్తులు అందరూ పానీ పూరీ బండి దగ్గరకు క్యూ కడతారు. అయితే గోల్ గప్పా అతిగా తినడం వలన అనర్ధాలున్నాయన్న సంగతి తెలుసా..!
పానీ పూరిని చింతపండు రసంతో కలిపి ఇస్తారు. ఇలా చింతపండు నీరు తాగడం వల్ల పేగులపై ఒత్తిడి పడుతుంది. రెగ్యులర్ గా పానీ పూరీని తినడం వలన పెద్దప్రేగులో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి
సాయంత్రం వేళ ఏదైనా తినాలని పిస్తే ఎక్కువ మంది దృష్టి స్ట్రీట్ పుడ్ వైపు దృష్టి వెళ్తుంది. పానీ పూరీ, చాట్, సమోసా ఛాట్ వంటి వాటిని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఎక్కువ మంది ఇష్టంగా తినేది పానీ పూరీ అనడంలో సందేహం లేదు.
వర్షాకాలంలో పానీ పూరీ తినడం సరికాదని అందరికీ తెలుసు. అయితే వర్షాకాలంలో నీరు కలుషితమవుతుంది. పానీ పూరీలో ఉపయోగించే నీటితో కడుపు ఇన్ఫెక్షన్, అతిసారం వచ్చే అవకాశం ఎక్కువగా పెరుగుతుంది. కనుక పానీ పూరీని వర్షాకాలంలో తినకుండా ఉండడం మంచిది.
పానీ పూరీ కూరలో ఉపయోగించే బంగాళదుంపలను తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు నూనెలో వేయించిన పూరీని ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. క్యాన్సర్‌కు కారకంగా మారుతుంది.
పానీపూరిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కనుక పానీపూరీకి వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్నవారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
చాలా చోట్ల గ్లౌజులు వేసుకోకుండానే పానీ పూరీని అమ్ముతూ ఉంటారు. దీంతో పానీపూరీ అమ్మేవారి చేతిలో ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటే.. అలాంటి పానీపూరీని తిన్నవారికి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువ.