
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీర జీవక్రియ (Metabolism) సక్రమంగా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుమట్టుతాయి. జీవనశైలిలో మార్పులతోపాటు ఈ కింది చిట్కాలను కూడా పాటించారంటే ఈ కడుపు చల్లగా ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ కింది నియమాలను పాటిస్తే సరి. అవేంటంటే..

కొంత మంది శరీరంలోని హానికారకాలను తొలగించడానికి ఉపవాసం చేస్తుంటారు. కానీ అంత శ్రమ అవసరం లేదు. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు భోజనం చేసి వేళకు నిద్రపోతే సరిపోతుంది. ఎందుకంటే నిద్ర మీ శరీర జీవక్రియలో సహాయపడుతుంది.

ఆహారంలో కొవ్వు స్థాయిలను పెంచండి. అలాగే కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఇలా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ మితంగా ఉంటుంది. కానీ దీన్ని అనుసరించేముందు మీ జీర్ణక్రియ సక్రమంగా ఉందో లేదో.. నిర్ధారించుకోండి.

ప్రాసెస్ చేసిన ఆహారానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వీటిల్లోని సోడియం కంటెంట్ శరీర జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనారోగ్యానికి గురవ్వక తప్పదు.