
చాలా మంది చిన్న పిల్లల్లో జీర్ణక్రియ సమస్యలు తరచూ తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఇటువంటి పరిస్థితిలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని రకాల పండ్లను పిల్లల ఆహారంలో చేర్చాలి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పిల్లలను బలంగా ఉంచుతాయి.

అరటిపండు రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎంతో మంచిది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పిల్లల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తిన్న తర్వాత మీరు తాజాగా అనుభూతి చెందుతారు. పైగా ఈ పండు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అవకాడోలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇందులో ఫైబర్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కడుపులో నులిపురుగుల సమస్యతో చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి అవకాడో పండ్లను అందిస్తే మంచి ఫలితముంటుంది. పైగా ఇది పిల్లల మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆపిల్ చాలా రుచికరమైనది అలాగే ఆరోగ్యకరమైనది. ఇందులో పెక్టిన్ ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని తిన్న తర్వాత పిల్లలు శక్తివంతంగా ఉంటారు. ఇది అతిసారం, విరేచనాల లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు సహకరిస్తుంది. ఇది శరీరం pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.