ఈ రోజుల్లో గుండె సమస్యలు సాధారణమై పోయాయి. గతంలో 60 యేళ్లు పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని గుండె సమస్యలు భయపెడుతున్నాయి. ఎంతో మంది చిన్న వయసులోనే గుండె సమస్యలతో బాధపడుతున్నారు.
అస్తవ్యస్తమైన జీవనశైలి అందుకు ప్రధాన కారణం. జంక్ ఫుడ్ తినడంతోపాటు మరికొన్ని కారణాలు గుండె సమస్యలను ఆహ్వానిస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆహారం, మద్యపానాన్ని నియంత్రించడం చాలా అవసరం. లేదంటే ఏ క్షణాన్నైనా ప్రమాదం జరగవచ్చు.
గుండెను నేరుగా దెబ్బతీసే పానీయాలు అనేకం ఉన్నాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే ఇలాంటి డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల పండ్ల రసాలు ప్యాకెట్లలో లభిస్తున్నాయి. అనేక మంది ఈ పండ్ల రసాలను ఇష్టంగా సేవిస్తుంటారు. నిజానికి ఇవి గుండె సమస్యలను మరింత పెంచుతాయి.
ఎందుకంటే అటువంటి రసాలలో చక్కెర చాలా అధికంగా ఉంటుంది. ఇది గుండెకు హానికరం. కాబట్టి ఇంట్లో తయారుచేసుకున్న పండ్ల రసాలను తాగడం బెటర్. ఆల్కహాల్ గుండెకు కూడా చాలా హానికరం. ఇది నేరుగా గుండెను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా, అధిక రక్తపోటు సమస్యను పెంచుతుంది. కాబట్టి బయట మార్కెట్లో దొరికే పండ్లరసాలు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.
నేటి కాలంలో చాలా మంది అలసటను అధిగమించడానికి వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. ఇటువంటి ఎనర్జీ డ్రింక్స్ గుండెకు హాని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.