Cold: రాత్రివేళ ముక్కుదిబ్బడ వేధిస్తోందా? సింపుల్ టిప్స్.. దెబ్బకు జలుబు పరార్..

|

Dec 15, 2022 | 3:00 PM

Rid of Stuffy Nose: నవంబర్ మొదలు ఫిబ్రవరి వరకు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో జలుబు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సర్వసాధారణం. అయితే..

1 / 6
నవంబర్ మొదలు ఫిబ్రవరి వరకు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో జలుబు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సర్వసాధారణం. అయితే, జలుబు రాత్రిపూట ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. ముక్కు దిబ్బడ(ముక్కు మూసుకుపోతుంది) వంటి సమస్య వేధిస్తుంది. రాత్రంతా నిద్రలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఈ సమస్యను మెడిసిన్‌తో కాకుండా, ఇంటి నివారణ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
చలికాలంలో ముక్కు దిబ్బడ అనేది సాధారణం. అయితే ఈ సమస్య రాత్రుల మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. నిద్ర పట్టదు. అయితే, ఈ సమస్య నివారణ కోసం ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటే.. ఆరోగ్యంపై మరింత దుష్ప్రభావం చూపుతుంది. మెడిసిన్స్‌కి బదులుగా, కొన్ని ఇంటి నివారణలను పాటించడం ఉత్తమం. వీటిద్వారా ముక్కు దిబ్బడ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

3 / 6
మస్టర్డ్ ఆయిల్: మీకు తరచుగా ముక్కు దిబ్బడ సమస్య ఉంటే.. తప్పనిసరిగా ఆవాల నూనెను ప్రయత్నించొచ్చు. ఆవాల నూనెలో మీ చేతి వేలిని పెట్టి.. ఆ నూనె వాసను పీల్చాలి. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

4 / 6
సెలెరీ రెసిపీ: సెలెరీలో ఉండే మూలకాలు చిటికెలో ముక్కు దిబ్బడ సమస్యను తగ్గిస్తాయి. సెలెరీని కొద్దిగా వేయించి, ఆపై దానిని ఒక క్లాత్‌లో చుట్టి.. వాసన చూడాలి. దానికి కర్పూరం కూడా కలుపొచ్చు. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

5 / 6
అల్లం: అల్ల కూడా ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అనేక సమస్యల నుంచి శరీరాన్ని ఇది రక్షిస్తుంది. అయితే, మీరు చేయాల్సిందల్లా అల్లం ముక్కను శుభ్రం చేసి.. దాని వాసన పీల్చుకోవడమే. రోజుకు కనీసం రెండుసార్లు ఇలా చేస్తే ముక్కు దిబ్బడ సమస్య తగ్గిపోతుంది.

6 / 6
ఉల్లిపాయ వంటకం: ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు, అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శ్వాస వ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తుంది. ముక్కు మూసుకుపోయినప్పుడు ఉల్లిపాయను సగానికి కట్ చేసి వాసన చూడాలి. అవసరమైతే.. ఉల్లిపాయ నీటిని ఆవిరితో కూడా తీసుకోవచ్చు.