WHO ప్రకారం ధూమపానం అలవాటు ఉన్నవారికి మిగతా వారికంటే కొవిడ్ ప్రమాదం ఎక్కువని హెచ్చరించింది. పైగా వారిలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయని, ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిచ్చని పేర్కొంది. అందుకే ఈ అలవాటుకు దూరంగా ఉండాలని సూచిస్తుంది.
ధూమపానం మానేయడానికి ట్రైఫ్లర్ పౌడర్ సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి పడుకునే ముందు ట్రైఫ్లర్ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగాలి. దీనిని తీసుకోవడం సిగరెట్, పొగాకు పదార్థాలపై ధ్యాస కలగదు.
నీరు పుష్కలంగా త్రాగాలి. ఈ సందర్భంలో కొబ్బరి నీళ్లు మరింత సమర్థంగా పనిచేస్తాయి. ధూమపానం మానేయడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి నీరు ఎక్కువగా తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.
ఈప్రపంచంలో మనకు అసాధ్యమైనదీ ఏదీ లేదు. ధూమపానం కూడా మానేయడం మరీ కష్టమేమీ కాదు. అలాగనీ ఈ-సిగరెట్ల జోలికి అసలు పోకూడదు. ఇందుకోసం కొన్ని సాధారణ ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
రాగి పాత్రలో నీళ్లు తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాదు పొగాకు పదార్థాల వ్యసనాన్ని కూడా తగ్గిస్తుంది.
పొగతాగడం మానేయాలంటే చూయింగ్ గమ్ తినడం చాలా అవసరమని చాలా మంది చెబుతుంటారు. అయితే చూయింగ్ గమ్ కంటే సోంపు ఆరోగ్యకరమని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ ఒక చెంచా పాటు దీనిని తీసుకుంటే మంచి ఫలితముంటుంది. దీనిని మౌత్ ఫ్రెషనర్‌గా కూడా తీసుకోవచ్చు.