కీళ్ల నొప్పులు మాయం: పాలల్లో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఎముకలను బలేపేతం చేసే పోషకాలు ఉంటాయి. అలాగే ఖర్జూరలో అనేక రకాల యాంటీ ఆక్సెడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడమే కాక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
జ్ఞాపకశక్తి: మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఖర్జూరాలు కలిపిన పాలు కీలకంగా పనిచేస్తాయి. దీనిలోని పోషకాలు నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, బ్రెయిన్‌కి బూస్టింగ్ ఇస్తాయి.
జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఖర్జూరంలోని ఫైబర్ చక్కని పరిష్కారం. ఖర్జూరాలు కలిపిన పాలను తాగితే జీర్ణక్రియ పెరుగుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి, కడుపు మంట వంటి సమస్యలు దూరం అవుతాయి.
రక్తహీనత దూరం: ఖర్జూరం, పాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా ఖర్జూరం కలిపిన పాలను తాగితే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఐరన్ శరీరంలో రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి, రక్తహీనతను నివారిస్తుంది.
చర్మ సంరక్షణ: చర్మాన్ని మెరిసేలా చేయడంలో పాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇక ఖర్జూరాలు కలిపిన పాలు తాగితే చర్మంపై మంట, చికాకు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే తాగితే రక్త ప్రసరణ పెరిగి ముఖం ఆకర్షణీయంగా మారుతుంది.