
ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఎక్కువసేపు ఉండటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు పెరుగుతాయి. అలాంటి సమయంలో మీరు సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు. వారంలో మూడు నుంచి నాలుగు రోజులు సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డీ అందుతుంది.

చలికాలంలో తరచూ సన్‌బాత్ చేయడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చలికాలంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారు ఇలా ఎండలో కూర్చోవడం మంచిది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సన్ బాత్ చేయడం వల్ల శరీరంలో సెరోటోనిన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

చలికాలంలో మన చర్మం పూర్తిగా పొడిబారుతుంది. అందుకే ఎండలో కూర్చోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. సూర్యకిరణాలు చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. సూర్యరశ్మి వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మ సమస్యల నుంచి ఉపశమనం, చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. బద్ధకం ఉంటే సూర్యరశ్మి వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.

మంచి నిద్ర కోసం కూడా సన్ బాత్ కూడా అవసరం. ఇది శరీరంలో మెలటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది. మీరు ప్రశాంతంగా సరిపడా నిద్రపోయినప్పుడు, మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు.

చర్మం సూర్యుని నుంచి వచ్చే UVB కిరణాలను గ్రహిస్తుంది. ఇది విటమిన్ డీని క్రియాశీల రూపంలోకి మారుస్తుంది. ఈ విటమిన్ డి మన శరీరంలో శోషించబడుతుంది. ఇది వివిధ శారీరక విధులకు సహాయపడుతుంది.