21 రోజుల పాటు కాఫీ తాగకపోతే.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

|

Aug 20, 2024 | 6:18 PM

ఉదయాన్నే కప్పు కాఫీ,టీ గానీ, కడుపులో పడందే ఏ పని మొదలుపెట్టలేరు చాలా మంది. టీ, కాఫీ తాగనిదే రోజు మొదలు కాదు చాలా మందికి. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, బద్ధకాన్ని వదిలించుకోవడానికి, తలనొప్పిని వదిలించుకోవడానికి ఇలా వివిధ కారణాలతో రోజూ కాఫీ, టీలను తాగుతుంటారు. మరి..21 రోజుల పాటు కాఫీ అలవాటును పూర్తిగా మానేయడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది..? ఎలాంటి మార్పులు వస్తాయి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కాఫీని మానేయడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక సానుకూల మార్పులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలో ఉండే కెఫిన్ ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. 21 రోజుల పాటు కాఫీని మానేయడం ద్వారా, మీరు ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. కాఫీలోని కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. 21 రోజుల పాటు కాఫీ తాగకపోవడం వల్ల మీ రక్తపోటు అదుపులో ఉంటుంది.

2 / 5
కాఫీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. 21 రోజుల పాటు కాఫీ తాగకపోవడం వల్ల మీ నిద్రనాణ్యత మెరుగవుతుంది. అలాగే తొందరగా పడుకోవచ్చని ఆరోగ్య నిపుణులంటున్నారు. దీంతో మీరు రిఫ్రెష్ గా ఉంటారు. కెఫిన్ శరీరం నుండి నీటిని తొలగిస్తుంది. ఇది డీ హైడ్రేషన్‌కు కారణమవుతుంది. 21 రోజుల పాటు కాఫీ మానేయడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

3 / 5
కాఫీలో ఉండే టానిన్లు దంతాలను పసుపు రంగులోకి మార్చగలవు. కాఫీ, టీలలో ఉండే కొద్ది ఆమ్ల స్వభావం వల్ల దంతాలు రంగు మారుతాయట. అలాగే కొన్ని దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులంటున్నారు. 21 రోజుల పాటు కాఫీ తాగకపోతే దంతాల రంగు మెరుగుపడుతుంది.

4 / 5
మూడు వారాల పాటు కాఫీ, టీ తాగని వారి బరువులో కూడా మార్పును గమనిస్తారని, వెయిట్‌ లాస్‌ అవుతారని ఆరోగ్య నిపుణులంటున్నారు. వీటిలో ఉండే చక్కెర బరువు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలను తక్కువగా తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.

5 / 5
ఎక్కువ కాఫీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. 21 రోజుల పాటు కాఫీని మానేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రారంభంలో, కాఫీ మానేయడం వల్ల కొంత అసౌకర్యం కలుగవచ్చు. మీరు దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. కానీ 21 రోజులు కాఫీ మానేసిన తర్వాత మీ దృష్టి మెరుగుపడుతుంది.

ఎక్కువ కాఫీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. 21 రోజుల పాటు కాఫీని మానేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రారంభంలో, కాఫీ మానేయడం వల్ల కొంత అసౌకర్యం కలుగవచ్చు. మీరు దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. కానీ 21 రోజులు కాఫీ మానేసిన తర్వాత మీ దృష్టి మెరుగుపడుతుంది.