పచ్చి వేరుశెనగలోని పోషక విలువలు మన శరీరంలోని ఎముకల నిర్మాణం, కండరాల బలానికి సహాయపడుతుంది. వేరుశెనగలను నిత్యం తినడం వల్ల మన మెదడు పనితీరును మెరుగుపడడమే కాక క్యాన్సర్‌ను నివారించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంటుంది.
పచ్చి వేరుశెనగలో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్ వంటి అనేక ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ కారణంగా ప్రతిరోజూ కొన్ని పచ్చి వేరుశెనగలను తినడం మంచిది.
పచ్చి వేరుశెనగలను పొడి రూపంలో కూడా నిల్వచేయవచ్చు. లేదా పాన్‌లో వేసి వేయించుకోవచ్చు. అలా కాకుండా ఫిల్టర్ చేసిన నూనెలో వేయించి తింటే అందులో పోషక విలువలు ఉండవు.
వేరుశెనగలతో పాటు బాదం కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నట్స్‌లో అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండడం వల్ల కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. అలా ఉండడంతో షుగర్ కూడా తగ్గుతుంది.
వేరుశెనగలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అవి కొందరికి అంత మంచిది కాదు. శెనగలు అంటే చాలా మందికి ఎలర్జీ. వీటిని తినడం వల్ల గ్యాస్, హార్ట్ బర్న్ వస్తుంది. అలాగే చాలా మందికి మరణానికి దారితీసే అలెర్జీ(అనాఫిలాక్సిస్) కూడా వస్తుంది.