Health Benefit of Oranges: మంచి ఆరోగ్యం కోసం.. బలమైన శరీరం.. పదునైన మనస్సు రెండూ అవసరం. దీని కోసం శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉండాలి. ఈ ముఖ్యమైన పోషకం లోపం ఉంటే మీ శరీరం, మనస్సు రెండూ బలహీనమవుతాయి. సూర్యరశ్మిని సాధారణంగా విటమిన్ డి పొందేందుకు ఉపయోగిస్తారు. కానీ మీరు ఏదైనా తినడం ద్వారా కూడా ఈ పోషకాన్ని భర్తి చేసుకోవచ్చు. సాధారణంగా ఆహారం ద్వారా విటమిన్ డీ పొందాలనుకుంటే దాని కోసం నారింజ పండు (ఆరెంజ్) ను ఎంచుకోండి.
ఆరెంజ్‌లో ఎక్కువ విటమిన్ డి ఉంటుంది: సాధారణంగా మీరు నారింజను విటమిన్ సి ఆహారంగా గుర్తిస్తారు. కానీ, ఈ పుల్లని తీపి పండులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఆరెంజ్ జ్యూస్ (ఆరెంజ్ జ్యూస్ బెనిఫిట్స్) తాగడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
250 ml నారింజ రసం తాగడం వల్ల 100 IU విటమిన్ డి లభిస్తుంది. ఈ పోషకాల లోపాన్ని తీర్చడానికి ఆరెంజ్ గొప్ప పండు.. అని నిపుణులు పేర్కొంటున్నారు. తక్షణ శక్తిని పొందేందుకు దీనిని తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. బలహీనతతో బాధపడే వారికి గొప్ప ఎంపిక కూడా.. అందుకే ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిది.
నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సి అద్భుతమైన మూలాలు. ఈ పండ్లు కొల్లాజెన్ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది చర్మం స్థితిస్థాపకతను నిర్వహించడానికి కీలకమైన ప్రక్రియ. అదనంగా, విటమిన్ సి మీ చర్మాన్ని పర్యావరణ ఒత్తిళ్ల నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.
విటమిన్ డి ప్రయోజనాలు: ఎముకలు బలహీనపడతాయి. గుండె జబ్బులను నివారిస్తుంది. డిప్రెషన్‌ను నివారిస్తుంది. మూడ్ మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది..
ఫైబర్ కోసం నారింజ తినండి: ఆరెంజ్ అనేది ప్రతి సీజన్‌లో తినదగిన పండు, దీనిని రసం తీయకుండా తీసుకుంటే శరీరానికి పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.