అల్లం సహజ ఔషధం. అందుకే అనేక రోగాల నివారణకు ఆయుర్వేద ఔషధంగా దీనిని వినియోగిస్తుంటారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. పచ్చిగా నమలవచ్చు లేదంటే దీని రసాన్ని కూడా సేవించవచ్చు. అల్లం టీ కూడా తయారు చేసి తాగవచ్చు. అల్లంలోని జింజెరాల్ అనే సమ్మేళనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.