Velpula Bharath Rao |
Dec 08, 2024 | 9:43 PM
పాలకూరలో కేలరీలు తక్కువగా ఉన్నా అందుల్లో విటమిన్లు, పోషకాలు, ఫిల్లింగ్ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఒక కప్పు (100 గ్రాములు) పాలకూరలో 23 కేలరీలు, 3.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు , 3 గ్రాముల ప్రోటీన్, జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది.
పాలకూరలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో బీటా కెరోటిన్, లుటిన్ వంటి కెరోటినాయిడ్లు ఉన్నాయి. పాలకూర పలు వ్యాధులు రాకుండా తప్పుకోవచ్చు
పాలకూరలో ఉన్న అధిక పొటాషియం స్థాయిలు (ఒక కప్పులో మూడింట రెండు వంతులు దాదాపు 600 మిల్లీగ్రాములు కలిగి ఉంటాయి) రక్త నాళాలను సడలించి, రక్తపోటును తగ్గిస్తుంది.
పాలకూరలో మెగ్నీషియం, ఫోలేట్, బి విటమిన్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఈ పోషకాలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
పాలకూరలో విటమిన్ సీ,యాంటీ ఆక్సిడెంట్లు జలుబు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ పాలకూర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అంతే కాకుండా పాలకూరలో కాల్షియం, విటమిన్ కె కూడా ఉన్నాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.