
దానమిస్తే దోషాలు పోతాయంటారు. అదే పంటవేస్తే క్షేత్రం బాగుపడుతుందని చెబుతారు. ఆ నువ్వులే వంటల్లో వాడితే.. కొత్త రుచులు రువ్వుతాయి. జిహ్వకు రుచినిస్తాయి. ఒంటికి వేడినిస్తాయి. జఠరాగ్నిని ఉత్తేజపరుస్తాయి. కీళ్లకు సత్తువనిస్తాయి

అందుకే మన పెద్దోళ్లు నువ్వుల పొడిని వంటల్లో తప్పనిసరి చేశారు. కాయగూరల్లో.. మాంసాహారంలో.. తియ్యటి చక్కీల్లో.. ఇలా ఎందెందు వెదికినా అందందే కనిపించేలా నువ్వులు ఇనియోగిస్తారు.

ముఖ్యంగా శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకు రోజువారీ ఆహారంలో కాసిన్ని నువ్వులను చేర్చుకోవడం అవసరం. శీతాకాలంలో నువ్వులు తినడం వల్ల శరీరం లోపలి నుంచి వేడిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం మంచిది. ముఖ్యంగా రోజూ ఓ స్పూన్ నువ్వులు తింటే చలి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ కాలంలో ప్రతిరోజూ నువ్వుల లడ్డులు లేదా సాధారణ నువ్వుల చట్నీ కూడా తినవచ్చు. నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. నులు చర్మానికి కూడా మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వుల పొడిని తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి. నువ్వులు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.