వంటింట్లో ఉండే యాలకుల్లో ఉన్న పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిని సువాసన రుచి కోసం స్వీట్లు, టీ, పలు రకాల వంటకాలలో వేస్తారు. యాలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాలకులను సాధారణంగా నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. రోజూ నమిలి తింటే నోటి దుర్వాసన పోతుంది.
ఫేస్ నిగారింపు కోసం అందరూ తెగ కష్టపడుతుంటారు. దీనికోసం మీరు యాలకులను ఉపయోగించవచ్చు. ముఖానికి ఏలకుల నూనెను ఉపయోగిస్తే అది మచ్చలను తొలగించి మెరిసిపోయేలా చేస్తుంది.
కావాలంటే.. యాలకుల పొడి చేసి అందులో కొద్దిగా తేనె కలపాలి. ఆ తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. గంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
యాలకులను చాలా బ్యూటీ ప్రొడక్ట్స్, లిప్ కేర్ క్రీములలో ఉపయోగిస్తారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. యాలకులను గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకోవాలని. దానిని తేనెలో మిక్స్ చేసి పెదవులపై రుద్దండి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.
క్రమం తప్పకుండా యాలకులను తింటే.. అవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడతాయి. శరీర నిర్విషీకరణ ప్రభావం ముఖంపై కూడా కనిపిస్తుంది. దీంతో చర్మం క్లీన్‌గా మారి ముఖంపై అద్భుతమైన గ్లో వస్తుంది.