Anapakaya ginjalu: చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం.. ఇది పోషకాల నిధి!

Updated on: Jan 12, 2026 | 4:30 PM

అనపకాయ.. గ్రామాల్లో దీనిని ఎక్కువగా తింటారు. పట్టణ ప్రజలకు కాస్త తక్కువగానే పరిచయం ఉంటుంది. దీనిని ఇండియన్ బీన్స్, పపాయా బీన్స్, ల్యాబ్లాబ్ బీన్స్, టోంగా బీన్స్, ఆస్ట్రేలియన్ పీస్ వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. కానీ, అనపకాయ మొక్క ఆకులు, వేర్లు, గింజలు, కాయలు, పువ్వులు అన్నీ తినదగినవే. ముఖ్యంగా అనపకాయ గింజలను ఎక్కువగా తింటారు. వీటితో కొందరు కూరలు చేస్తుంటారు. మరికొందరు ఉండికించి గుగ్గిల్లుగా కూడా తింటారు. అయితే, అనపకాయ గింజల్ని ఉడకబెట్టి తినడం వల్ల శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం...

1 / 5
అనపకాయ గింజలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండటానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇది రోజు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ గింజలను బాగా ఉడికించి మాత్రమే తినాలి. వారానికి మూడుసార్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2 / 5
 అనపకాయ గింజలను ఉడికించి తినటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గుండె కండరాలు బలోపేతమవుతాయి. వీటిలో ఉండే పీచు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

3 / 5
అనపకాయ గింజలను తరచూ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, అల్సర్‌, నులిపురుగులులాంటి సమస్యలు తీరుతాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తినాలనే కోరికను తగ్గించి శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తాయి.

4 / 5
అనపకాయల్లో విటమిన్‌ డి, కాల్షియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతక్షయం నుంచి కాపాడతాయి. పొటాషియం, మాంగనీస్‌, జింక్‌ కండరాల తిమ్మిరి సమస్యను దూరం చేస్తాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

5 / 5
అనపకాయ గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు.. హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి. మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే, మాంగనీస్, జింక్ ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యల నివారణకు కూడా సహాయపడతాయి.