Harsingar Benefits: పారిజాతం ఆకులో ఔషధ గుణాలు.. కీళ్ల నొప్పుల నివారణకు బెస్ట్ రెమిడీ.. ఎలా ఉపయోగించాలంటే..

Updated on: May 13, 2022 | 4:45 PM

Harsingar Benefits: పారిజాతం ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నొప్పిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

1 / 5
పారిజాతం ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. కడుపులో మంట, జలుబు, దగ్గు, శరీరంలోని నులిపురుగుల సమస్యను దూరం చేయడంలో మంచి సహాయకారి. పారిజాతం ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

2 / 5
ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు.. ముఖ్యంగా చేతులు, కాళ్ళు , మోకాళ్లలో చాలా నొప్పి ఉంటుంది. ఈ ఆకులను ఉపయోగించడం ద్వారా, మీరు కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. దీని ఆకులను నీటిలో మరిగించి వడగట్టి తాగవచ్చు. ఖాళీ కడుపుతో ఆకులు మరిగించిన నీటిని తాగడం మేలు చేస్తుంది.

3 / 5
జలుబు , దగ్గు నుండి ఉపశమనం.. మారుతున్న వాతావరణం కారణంగా, చాలా సార్లు జలుబు, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు రాకుండా నివారిస్తాయి. పారిజాత ఆకుల పేస్ట్ లో కొంచెం తేనె కలుపుకుని తాగాలి.

4 / 5
కడుపులో నులి పురుగుల నివారణకు.. పిల్లలు తరచుగా కడుపులో నులి పురుగులతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను తొలగించడానికి, పారిజాత ఆకుల సారాన్ని తీసుకోవాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి సూక్ష్మ క్రిములయూ తొలగించడంలో సహాయపడతాయి.

5 / 5
గాయం నయం చేయడానికి ప్రయోజనకరమైనది: కొన్నిసార్లు గాయాలు సమయానికి నయం చేయలేవు. పారిజాతం ఆకులలో క్రిమినాశక, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి గాయాన్ని త్వరగా నయం చేసేలా చేస్తాయి. గాయాల నొప్పి నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. దీని కోసం పారిజాతం ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకుని గాయంపై పూయాలి.
అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్య సలహా సూచనలు తీసుకోవాలి

గాయం నయం చేయడానికి ప్రయోజనకరమైనది: కొన్నిసార్లు గాయాలు సమయానికి నయం చేయలేవు. పారిజాతం ఆకులలో క్రిమినాశక, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి గాయాన్ని త్వరగా నయం చేసేలా చేస్తాయి. గాయాల నొప్పి నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. దీని కోసం పారిజాతం ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకుని గాయంపై పూయాలి. అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్య సలహా సూచనలు తీసుకోవాలి