
చింత చెట్టు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చింత చిగురు, చింత పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింత చిగురులో కూడా అనేక పోషకాలు ఉంటాయి. అందుకే పెద్దలు చింత చిగురుతో కూడా ఆహారాలు తయారు చేసి పెడుతూ ఉంటారు. ఇప్పటికీ చింత చిగురుతో గ్రామాల్లో వంటలు తయారు చేస్తూ ఉంటారు. వీటితో చేసిన వంటలు ఎంతో రుచిగా ఉంటాయి.

కొన్ని సమస్యలను తగ్గించడంలో చింత చెట్టు చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో చింత చెట్టు ఆకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చింత చెట్టు ఆకులతో జుట్టును ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కొద్దిగా చింత చెట్టు ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని పేస్టులా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా ఓ పావు గంట సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ జరిగి.. కుదుళ్లు బలపడతాయి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. చింత చెట్టు ఆకుల్లో యాంటీ ఆన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలంగా మార్చడంలో సహాయ పడుతుంది.

ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు చిట్లడం, రాలడం, దురద వంటివి తగ్గుతాయి. జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. పొడవుగా, ఒత్తుగా మారుతుంది. అలాగే జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)