
మరొక కప్పు లంచ్‌కు 30 నిమిషాల ముందు తాగితే ఫ్యాట్ కట్ అవ్వడానికి బాగా సహాయపడుతుంది. దాంతో పాటుగా రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇది గ్రీన్ టీ ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది. రాత్రి తక్కువగా తినడం వల్ల గ్రీన్ టీ ప్రభావం రాత్రి సమయంలో కూడా కంటిన్యూ అవుతుంది.

గ్రీన్ టీ, నెయ్యి తరహాలోనే దాల్చిన చెక్క కూడా శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఇందులోని సిన్నమాల్డిహైడ్ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దాల్చిన చెక్క మన శరీరంలో ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచి, షుగర్ స్థాయులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు తాగే గ్రీన్‌టీలో నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల కూడా మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సమర్థవంతంగా అందేందుకు నెయ్యి వీలు కల్పిస్తుంది. నెయ్యిలో ఉండే బ్యూటైరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. ఈ రెండింటీ కలయికతో బరువు తగ్గే ప్రయాణం వేగవంతం అవుతుంని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మెటబాలిజం వేగంగా పనిచేయటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని గ్రీన్ టీని చక్కెర లేకుండా తాగాలి. తేనె కూడా కలుపుకోకపోవడం మంచిది.

దాల్చిన చెక్కలో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయని... ఇవి గ్రీన్ టీతో కలసి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.