
కొలెస్ట్రాల్: అవకాడోలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇందుకోసం రోజూ ఒక అవకాడో పండును తినడం మంచిది.

Healthy For Heart- గుండె: వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Good For Vision- కంటి ఆరోగ్యం- యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అవకాడోలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.

Improves Digestion- వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Good For Skin- అవకాడోలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం దృఢత్వం, స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడతాయి. అవకాడో తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గడంతోపాటు బరువు తగ్గవచ్చు.