Green Chilli Effects: పచ్చి మిర్చిని బాగా తింటున్నారా..? ప్రమాదంలో పడకముందే ఈ విషయాలను తెలుసుకోండి..

|

Jul 22, 2023 | 6:03 AM

Green Chilli Side Effects: పచ్చి మిరపకాయ లేకుండా కూరలను అస్సలు ఊహించలేం.. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణంగా కనిపిస్తుంది. భారతీయ వంటకాలల్లో పచ్చి మిరపకాయను.. కూరలల్లో, పచ్చళ్లలో ఉపయోగిస్తారు.

1 / 5
Green Chilli Side Effects: పచ్చి మిరపకాయ లేకుండా కూరలను అస్సలు ఊహించలేం.. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణంగా కనిపిస్తుంది. భారతీయ వంటకాలల్లో పచ్చి మిరపకాయను.. కూరలల్లో, పచ్చళ్లలో ఉపయోగిస్తారు. అయితే, పచ్చిమిరపకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్, కార్బోహైడ్రేట్ వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

2 / 5
ఇవే కాదు, పచ్చి మిర్చిలో బీటా కెరోటిన్, క్రిప్టోక్సాంథిన్, లుటిన్-జియాక్సంథిన్ తదితర ఆరోగ్యకరమైన అంశాలు కూడా ఉంటాయి. అయితే, మిరపను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ.. తీసుకోవాల్సిన పరిమాణం కంటే ఎక్కువ తీసుకుంటే.. అనారోగ్యం బారిని పడక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. పచ్చిమిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటి.. రోజులో ఎంత పరిమాణంలో తినాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 5
చైనాలోని న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పచ్చి మిరపకాయలు చాలా నష్టాలను కలిగి ఉంటాయని, ప్రతికూల ప్రభావం వల్ల అవి శరీరానికి మరింత ప్రమాదకరమని సూచిస్తున్నాయి.

4 / 5
రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల డిమెన్షియా వంటి పరిస్థితులు తలెత్తుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిర్చి ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీనివల్ల అరోగ్యం దెబ్బతింటుంది.

5 / 5
పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల పొట్టలో ఏర్పడే రసాయనిక చర్య వల్ల కడుపులో మంట, వాపు మొదలైనవి ఏర్పడతాయి. పచ్చి మిరపకాయలు కూడా అసిడిటీకి కారణం కావచ్చు. కావున పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.