
ఉరుకులు పరుగుల జీవితంలో పురుషులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా లైంగిక పరమైన సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది.

మసాలా దినుసు యాలకుల్లో ఔషధ గుణాలతోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు మంచి సువాసనను కలిగి ఉంటాయి. అయితే.. వీటిని రెగ్యులర్‌గా తింటే.. మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

యాలకులలో విటమిన్ B6, విటమిన్ B3, విటమిన్ C, జింక్, కాల్షియం, పొటాషియం అలాగే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి పురుషుల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని పేర్కొంటున్నారు.

పురుషులు రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.

యాలకులు రోజూ తీసుకుంటే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

యాలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి పురుషుల జీవితంలో కొత్తదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

యాలుకలు తినడం వల్ల సెక్స్ పట్ల కోరిక పెరిగి భాగస్వామికి చాలా దగ్గరవుతారు. అందువల్ల పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ యాలకులను తీసుకుంటే మంచిదంటున్నారు.

దీంతోపాటు కాలేయ వ్యాధులు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, ఫ్యాటి లివర్ ప్రమాదాన్ని నివారించడంలో యాలుకలు సహాయపడతాయి.

అంతేకాకుండా శరీరం నుంచి వ్యర్థాలను సైతం తొలగిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా, టాక్సిన్‌లను తొలగించి.. మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి.