
Banks Privatisation: బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులుగా మారుతుంటే.. మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నారు.

రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి ముందస్తు చర్యలు జరుగుతున్నాయని బ్యాంకింగ్ సెక్రటరీ వెల్లడించారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అణుగుణంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ముందస్తు చర్యలు జరుగుతున్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా సోమవారం తెలిపారు.

ప్రభుత్వం ఈ సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల(PSB) ప్రైవేటీకరణను చేపట్టనున్నట్లు ప్రకటించింది.