
వృషభ రాశి : వృషభ రాశి వారికి దసరా అదృష్ట తీసుకొస్తుందనే చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారు దుర్గామాతను పూజించడం లేదా ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయంట. అంతే కాకుండా ఏ పని చేసినా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుందంట.

మిథున రాశి : మిథున రాశి వారికి నవరాత్రి రోజులు చాలా అద్భుతంగా గడుస్తాయి. వీరు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి ఎవరైతే కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. అంతే కాకుండా వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది

తుల రాశి : తుల రాశికి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండబోతుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ అవుతారు. ఈ రాశి వారి నూతన గృహ నిర్మాణ కల నెరవేరుతుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోయి చాలా ఆనందంగా జీవిస్తారు.

సింహ రాశి : సింహ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కానీ అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వచ్చి చేరుతుంది. విందు విహార యాత్రలకు ఇది మంచి సమయం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి దేవీ నవరాత్రి రోజులు చాలా మంచి రోజులనే చెప్పాలి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి దసరా అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కనుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది.