
ఈ రెసిపీలో వాడే గోంగూర, రొయ్యలను కలిపి తీసుకోవడం వలన మన శరీరానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే, ఈ రెండింటిలో కావాల్సిన పోషకాలు ఉన్నాయి. రొయ్యలను వారంలో రెండు సార్లు తీసుకుంటే పోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు: అర కిలో గోంగూర, అర కిలో రొయ్యలు, ఉల్లిపాయ చిన్నది, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి - అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మసాలా పొడి , రుచికి సరి పడినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి.

ముందుగా రొయ్యలను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలో పసుపు వేసి మళ్ళీ ఇంకో సారి శుభ్ర పరచండి. ఇక ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి దానిలో గోంగూర ఆకులు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఇక ఇప్పుడు మీరు తీసుకున్న అన్ని రకాల పొడిని బాగా మిక్స్ చేసి కలపాలి.

ఇప్పుడు, ఈ మిశ్రమంలో ముందుగా తీసుకున్న రొయ్యలు వేసి 5 నిమిషాల తర్వాత గోంగూర పేస్టును కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇక ఇప్పుడు గ్రేవీ కోసం అర గ్లాసు నీళ్లు వేసి సన్నని మంట మీద 20 నిముషాలు ఉంచాలి. గ్రేవీగా మారాక కిందకు దించేయండి. అంతే వేడి వేడి గోంగూర రొయ్యల ఇగురు రెడీ.