
కావాల్సిన పదార్థాలు : మటన్, ఘరం మసాలా, బిర్యానీ ఆకు, నూనె, పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు, ఉప్పు, కారం, గోంగూర రెండు కట్టలు, ధనియాల పొడి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీనా.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా నల్లి బొక్కల కర్రీ ప్రిపేర్ చేయడం కోసం, నల్లి బొక్కలు, మటన్ తీసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి రెండు పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి.

తర్వాత అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసి , మంచిగా కలపాలి. తర్వాత పసుపు, అల్లం వలెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి మనం ముందుగా కలిపి పెట్టుకున్న నల్లి బొక్కలు మటన్ వేసి మంగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి. దాదాపు 15 నిమిషాల వరకు అవి మంచిగా ఉడికేలా చూసుకోవాలి.

తర్వాత ఇందులో శుభ్రం చేసి నూనెలో వేయించి పెట్టుకున్న గోంగూర తీసుకోని వేయాలి. గోంగూర వేసిన తర్వాత మరో పదినిమిషాల వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండూ ఎంత మంచిగా వేగితే రుచి అంత బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మంచిగా ఉడికించుకోవాలి. నీళ్లు పోయడం వలన కాస్త జ్యూసిగా వస్తుంది.

తర్వాత ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, అన్నీ వేసి మరో పావు గంట సేపు కలుపుతూ కర్రీ ఉడికించుకోవాలి. తర్వాత అన్నీ ఉడికిపోయి మంచి రుచి వస్తుంది. ఆ సమయంలో తరిగిన కొత్తిమీర, పూదీనా వేసుకొని, స్టవ్ ఆఫ్ చేసి కర్రీ పక్కన పెట్టాలి. అంతే నల్లి బొక్కలు గోంగూర కర్రీ రెడీ.