
అమెరికా- ఇరాన్ శాంతిఒప్పందంతో గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయని.. కొనుగోలు దారులు కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బుధవారం నుంచి మళ్లీ యూటర్స్ తీసుకొని బంగారం, వెండి ధరలు వేగంగా పుంజుకుంటున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై రూ.3450 పెరిగింది. అటు వెండి కూడా కేజీపై రూ,5000 వేలు పెరిగింది.

ఈ భారీ హెచ్చు తగ్గుల తర్వాత గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,550 వద్ద కొనసాగుతుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,500గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2,50,000కు చేరింది.

ఇక ఏపీలోని విశాఖ పట్నం, విజయవాడలో సైతం హైదరాబాద్ తరహా రేట్లే కనిపిస్తున్నాయి. ఈ నగరాల్లో 10 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,550 వద్ద కొనసాగుతుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,500గా ఉండగా వెండి ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతుంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, పూణె, బెంగళూరులో సైతం తులం బంగారం ధర రూ.1,44,550గా ఉండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,500గా వద్ద కొనసాగుతుంది. అయితే హైదరాబాద్‌లో పోల్చుకుంటే ఈ నగరాల్లో వెండి ధరలు కాస్తే వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ నగరాల్లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 2,45,000 వద్ద కొనసాగుతున్నాయి.

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,700 వద్ద కొనసాగుతుందగా చెన్నైలో మాత్రం తులం బంగారం ధర రూ. 1,46,180 వద్ద ట్రేడవుతుంది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,45,000 ఉండగా చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అనేవి ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కొనే ముందు ఒకసారి తాజా ధరలను తనిఖీ చేయండి.