ఆగస్ట్ 3 నాటికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 54,950, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59,950 కి పడిపోయాయి. రెండు రోజుల పాటు ఇలానే ఉన్న బంగారం ధరలు 5వ తేదీ పైకెగశాయి. ఆగస్ట్ 5 నుంచి 8 వరకూ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,150, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60,160 గా నిలకడగా ఉన్నాయి.