
పెళ్లిళ్ల సీజన్ వేళ కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంగళవారం కేవలం 4 గంటల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1200 పెరగ్గా, కేజీ వెండిపై రూ.4000 వేలు పెరిగింది.

మంగళవారం ఉదయం చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,620గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,57,410 వద్ద స్థిరపడింది. ఇక 22క్యారెట్ల బంగారం ధర రూ.1,45,400గా ఉండగా ఉదయం ఈ ధర రూ.రూ.1,44,290గా ఉంది.

ఇక విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, పూణె, కేరళ, ముంబైలోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,620గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,57,410 వద్ద స్థిరపడింది. ఇక 22క్యారెట్ల బంగారం ధర రూ.1,45,400గా ఉండగా ఉదయం ఈ ధర రూ.రూ.1,44,290గా ఉంది.

Gold And Silver

ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ కేజీ వెండి ధర ఉదయం రూ.2,75,000గా ఉండగా కేవలం నాలుగు గంటల్లోనే రూ.5వేలు పెరిగి ఉదయం 10గంటలకు కేజీ వెండి ధర రూ.2,80,000లకు చేరింది. అయితే ఈ ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి దరల అప్‌డేట్ కోసం సంబందిత వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి